మరో భారీ ప్రాజెక్టుతో సమంత

Thursday,December 08,2016 - 09:53 by Z_CLU

సమంత మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి రెడీగా ఉంది. జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా ప్రకటించని ఈ బ్యూటీ… త్వరలోనే ఓ భారీ బిగ్ బడ్జెట్ సినిమా డీటెయిల్స్ వెల్లడించబోతోంది. ఈ విషయాన్ని నిన్ననే ట్వీట్ చేసింది సమంత. దీంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోయే ప్రాాజెక్టు ఏమై ఉంటుందా అనే చర్చ ఊపందుకుంది.

samantha-ntr-ramcharan

ప్రస్తుతం సమంత చుట్టూ రెండు పెద్ద సినిమాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఒకటి రామ్ చరణ్-సుకుమార్ సినిమా. ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటివరకు చెర్రీతో కలిసి సినిమా చేయలేదు సమంత. మరోవైపు ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం కూడా సమంతను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ సక్సెస్ ను కంటిన్యూ చేసే ఉద్దేశంతో… సెంటిమెంట్ కొద్దీ మరోసారి సమంతనే హీరోయిన్ గా తీసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒక దానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. త్వరలోనే సమంత తన కొత్త ప్రాజెక్టులపై ఎనౌన్స్ మెంట్ ఇవ్వబోతోంది.