రూల్స్ బ్రేక్ చేసిన సమంతా

Thursday,May 23,2019 - 12:03 by Z_CLU

రూల్స్ మార్చేసుకుంది సమంతా. రెగ్యులర్ స్టార్ హీరోయిన్స్ లా అస్సలు ఆలోచించట్లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ అక్కినేని వారి కోడలు గత కొన్ని సినిమాలుగా ఈ 3 రూల్స్ ని తీసి గట్టున పెట్టేసింది.

రూల్ నంబర్ 1 : సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలే కానీ ఫీమేల్ లీడ్ కాదే అన్న ఆలోచన కూడా లేకుండా సంతకం చేసేస్తుంది. ‘రాజుగారి గది 2’, ‘మహానటి’ ఇప్పుడు చేస్తున్న ‘మన్మధుడు2’ లో కూడా సమంతా  హీరోయిన్ కాదు.

రూల్ నంబర్ 2: హీరోయిన్ అంటే గ్లామరస్ గానే ఉండాలి. ఈ ట్రేడ్ మార్క్ ని ఈజీగా చెరిపేసింది సమంతా. రంగస్థలం, మజిలీ సినిమాలు చేసి, తెరపై కనబడాల్సింది గ్లామర్ కాదు, క్యారెక్టర్స్ అని నిరూపించింది.

రూల్ నంబర్ 3 : జస్ట్ స్టార్ హీరో సినిమాల్లోనే నటించాలని ఫిక్సవ్వలేదు. స్టార్ హీరో లేకపోయినా ‘యూ టర్న్’లో నటించి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అదే పద్ధతిలో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ‘ఓ బేబీ’ చేస్తుంది.

గ్లామరస్ హీరోయిన్ పరిధి నుండి కంప్లీట్ నటి అనిపించుకునే ప్రాసెస్ లో సమంతా తన కరియర్ లో బెస్ట్ సినిమాలు చేయడమే కాదు.. టాలీవుడ్ లో డిఫెరెంట్ రివొల్యూషన్ తీసుకొస్తుంది.