మరో పెద్ద సినిమాలో సమంతా

Tuesday,May 16,2017 - 10:54 by Z_CLU

సమంతా డైరీలో మరో పెద్ద సినిమా చేరబోతోంది. ప్రస్తుతం రాజు గారి గది 2, మాహానటి, రామ్ చరణ్-సుకుమార్ సినిమాల్లో నటిస్తున్న సమంత… మరో వెంచర్ కి సంతకం చేసినట్టు తెలుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సమంతా అకౌంట్ లో చేరిన ఈ సినిమా, ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సస్పెన్స్ ఎలిమెంట్ లా మారింది.

సమంత సంతకం చేసిన ఆ సినిమాలో హీరో ఎవరు..? పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న స్యామ్ కి ఆ రేంజ్ లో ఎట్రాక్ట్ చేసిన స్టోరీ లైన్ ఏంటి..? ఎవరు చెప్పారు..? ఈ క్వశ్చన్స్ ఇప్పుడు టాలీవుడ్ లోని ప్రతి సెంటర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

త్వరలోనే నాగచైతన్య కొత్త సినిమా ఎనౌన్స్ చేయబోతున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమాకు ఓకే చెప్పాడు. ఇంకోవైపు బన్నీ, మహేష్ కూడా తమ కొత్త సినిమాల్ని ప్రకటించాడు. వీటిలో ఒక్కటి మినహా మిగతా అన్ని సినిమాల్లో హీరోయిన్ ప్లేస్ ఖాళీగా ఉంది. మరి వీటిలో సమంత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.