Pic Of The Day - రానా రోకా ఫంక్షన్

Friday,May 22,2020 - 01:15 by Z_CLU

హీరో రానా నిశ్చితార్థం పూర్తయింది. ప్రియురాలు మిహికా బజాజ్ తో రానా ఎంగేజ్ మెంట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన స్టిల్స్ అన్నీ ఒకెత్తయితే.. ఈరోజు రిలీజైన స్టిల్ మరో ఎత్తు.

రానా ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఫొటోను సమంత షేర్ చేసింది. ఈ ఫొటోలో దగ్గుబాటి యంగ్ బ్యాచ్ మొత్తం ఉంది. 2020లో బెస్ట్ న్యూస్ ను మోసుకొచ్చిన రానాకు థ్యాంక్స్ అంటూ ఈ ఫొటో షేర్ చేసింది సమంత. ఫొటోలో చైతూ-శామ్ జంట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఈ నిశ్చితార్థ వేడుకను దగ్గుబాటి ఫ్యామిలీ రోకా ఫంక్షన్ అని పిలుస్తోంది. అంటే ఈ వేడుకతో పెళ్లి పనులు అఫీషియల్ గా మొదలుపెట్టినట్టు లెక్క. త్వరలోనే రానా-మిహికా పెళ్లి తేదీని ప్రకటించబోతున్నారు.