Samantha Shaakuntalam - ఫస్ట్ లుక్ ఎప్పుడు?

Tuesday,June 29,2021 - 12:19 by Z_CLU

Samantha Shaakuntalam Movie Updates

సమంత లీడ్ రోల్ పోషిస్తున్న మైథలాజికల్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. సమంత సెట్స్ పైకొచ్చింది.

neelima guna shaakuntalam

సెకండ్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మించారు. లాక్ డౌన్ టైమ్ లోనే ఈ సెట్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు అందులోనే సమంతపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. షెడ్యూల్ లో భారీ సంఖ్యలో గుర్రాల్ని వాడుతున్నారనే విషయం చిన్న వీడియో ద్వారా తెలియజేశారు మేకర్స్.

shaakuntalam movie

ప్రస్తుతం సినిమాకు సంబంధించి శకుంతల పాత్రధారి సమంత, దుష్యంతుడుగా నటిస్తున్న దేవ్ మోహన్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50శాతం పూర్తయినట్టు తెలుస్తోంది.

samantha-shaakuntalam-శాకుంతలం-సమంత

మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్ పై చాలా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సమంత ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని ఆమె ఫ్యాన్స్ అడుగుతున్నారు. దీనిపై స్పందించిన యూనిట్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ఇంకా చాలా టైమ్ పడుతుందని చెబుతోంది.

samantha-shaakuntalam-movie-set-1

గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. సమంతతోపాటు దేవ్‌ మోహన్‌ కీ రోల్ పోషిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమాకు ఆర్ట్ డైరక్టర్ గా అశోక్ కుమార్ వర్క్ చేస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కోసం 60ల నాటి సంగీత పరికరాలతో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నాడు మెలొడీ బ్రహ్మ.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics