సమంతా రోల్ రివీల్ అయింది

Thursday,April 20,2017 - 07:15 by Z_CLU

జస్ట్ హీరోయిన్ రోల్స్ తో సరిపెట్టుకోవడం లేదు సమంతా. మహానటి సావిత్రి బయోపిక్ లో జర్నలిస్ట్ గా నటిస్తుంది. మరో సినిమా కోసం ఏకంగా కర్రసాము నేర్చుకుంటుంది. నాగార్జున హీరోగా నటిస్తున్న రాజుగారి గది 2 లో దెయ్యంలా నటిస్తుంది సమంతా.

అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమాలో సమంతాలోని మరో ఆంగిల్ ని చూడబోతున్నామని క్లారిటీ ఇచ్చేసింది సినిమా యూనిట్. మామూలుగానే హారర్ సినిమా అంటే దెయ్యం హైలెట్ అవ్వాల్సిందే కాబట్టి, సినిమాలో మంచి వెయిట్ ఉన్న పాత్ర అనే తెలుస్తుంది.

PVP సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.