సమంతా రోల్ రివీల్ అయింది

Wednesday,April 12,2017 - 12:06 by Z_CLU

రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటుంది రామ్ చరణ్ – సుకుమార్ టీమ్. ఈ సినిమాలో చెర్రీ సరసన సమంతా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్ కి సంబంధించి కొన్ని రోజులుగా ఇంటరెస్టింగ్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నింటికీ చెక్ పెట్టేసింది టీమ్.

ఈ సినిమాలో సమంతా విజువల్లీ హ్యాండికాప్డ్ గా కనిపించనుందనే టాక్, రూమర్స్ కి పెద్దగా స్పందించని వారిలో  కూడా కొత్త క్వశ్చన్స్ రేజ్ చేసింది. అందుకే అది నిజం కాదని సమంతా ఈ సినిమాలో రిచ్ గర్ల్ గా కనిపిస్తుంది అని క్లారిటీ ఇచ్చింది సినిమా యూనిట్.

ఈ సినిమాలో రామ్ చరణ్, సమంతా ఫస్ట్ టైమ్ జోడీ కడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అనసూయ కూడా ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేయనుంది.