Samantha - మెంటల్లీ ప్రిపేర్ అయిందంట

Tuesday,December 15,2020 - 10:11 by Z_CLU

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ, క్రేజీ హీరోయిన్ అనిపించుకుంటోంది సమంత. అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించాలా వద్దా అనే విషయాన్ని తను ప్లాన్ చేయలేదంటోంది ఈ అక్కినేని కోడలు.

అవును.. నాగచైతన్యతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చినప్పుడు సమంత ఇక సినిమాలు ఆపేద్దామని నిర్ణయించుకుందట. పెళ్లి తర్వాత తనకిక సినిమా ఛాన్సులు రావని మెంటల్లీ ఫిక్స్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుందట.

అయితే అదృష్టం కొద్దీ పెళ్లి తర్వాత కూడా తనకు అవకాశాలొచ్చాయని అంటోంది సమంత. అంతే తప్ప తను ప్లాన్ చేయలేదంటోంది. పెళ్లి తర్వాత రంగస్థలం సినిమా రిలీజవ్వడం తనకు పెద్ద ప్లస్ అయిందని అంటోన్న ఈ బ్యూటీ.. భవిష్యత్తులో కూడా సినిమాల్లో నటిస్తానని చెబుతోంది.

Also Check – మాల్దీవుల్లో సమంత అందాలు