చరణ్ తో సమంత ఫిక్స్ .....

Monday,March 06,2017 - 03:05 by Z_CLU

‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇటీవలే కోలీవుడ్ లో సినిమాలు  చేస్తున్న ఆపిల్ బ్యూటీ సమంత రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా  ఆల్మోస్ట్ ఫైనల్ అయిందనే  సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మొదటి సారి ఫుల్లెన్త్ విల్లేజ్ క్యారెక్టర్ లో డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్న ఈ సినిమా మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది..

అయితే ఈ సినిమా నుంచి సమంత తప్పుకుందనే వార్త నిన్నటి వరకూ హల్చల్ చేయగా ప్రెజెంట్ సమంత ఈ సినిమాకు ఫైనల్ అని మార్చ్ 22 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననుందని అఫీషియల్ గా తెలిపారు మేకర్స్… మార్చ్ 20న కొందరు నటీ నటులతో కొన్ని సెన్స్ తెరకెక్కించి 22 నుంచి సమంత పై సీన్స్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు యూనిట్… సో ఎట్టకేలకి చెర్రీ తో సమంత సెట్స్ పైకి వెళ్లబోతుందన్నమాట…