Samantha - ర్యాపిడ్ ఫైర్

Thursday,June 03,2021 - 02:36 by Z_CLU

 మీలో మీరు కోరుకునే మంచి ఫీచర్లు 3 చెప్పండి?
– నా శారీరక ధారుడ్యం, నా కళ్లు, నా నవ్వు

⇒ చైతూతో ఫైట్ జరిగితే ఫస్ట్ ప్యాచప్ అయ్యేది ఎవరు?

– నేనే రాజీ పడతాను

⇒ వెంటనే క్షమించేస్తారా.. లేక ఏదైనా ఇబ్బంది కలిగించే అంశాన్ని మరిచిపోవడానికి టైమ్ తీసుకుంటారా?
– ఏదైనా నేను తొందరగా మరిచిపోతాను.. ఎందుకంటే నాకు సిగ్గు లేదు (నవ్వుతూ)

samantha new stills zeecinemalu

                                             హీరోయిన్ సమంత

⇒ మీ దృష్టిలో డేట్ నైట్ అంటే..?

నా దృష్టిలో డేట్ నైట్ అంటే మనసారా నవ్వుకోవడం, కడుపునిండా తినడం.

⇒ రిలేషన్ షిప్ లో పాటించాల్సిన సూత్రాలు

– ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. ఎందుకంటే ఏ ఇద్దరూ ఒకలా ఉండరు. ఎదుటి వ్యక్తి అనుభవాల్ని వినాలి. కాస్త సరదాగా ఉండాలి.

⇒ రిలేషన్ షిప్ లో అస్సలు నచ్చని అంశాలు?
– మాటలతో హింసించడం, శారీరకంగా ఇబ్బంది పెట్టడం, గట్టిగా బూతులు తిట్టడం.. ఈ మూడూ నాకు నచ్చని అంశాలు

samantha-akkineni-new-stills

                                    సమంత

⇒ కరోనా మిమ్మల్ని ఏమైనా మార్చిందా?

– చాలా మార్చింది. కరోనాకు ముందు చాలామంది పని వెంట పరుగులు పెట్టేవారు. మంచి లైఫ్ స్టైల్ కోసం పరితపించేవారు. కానీ లాక్ డౌన్ అందర్నీ ఇంట్లో కూర్చోబెట్టింది. మన గురించి మనం ఆలోచించుకునేలా చేసింది. అంతేకాదు.. ఈ కరోనా టైమ్ లో చాలామందిలో మంచితనాన్ని నేను చూశాను. ఎంతో సహాయం చేస్తున్నారు.

⇒ లాక్ డౌన్ తో మానసిక సమస్యలు ఎదుర్కొన్నవాళ్లకు మీరిచ్చే సలహా?

– చాలా సింపుల్. యోగా చేయండి. రోజుకు కనీసం 30 నిమిషాలు యోగా చేసినా చాలు. అంతా సెట్ అయిపోద్ది

samantha-new-stills

                          సమంత అక్కినేని

⇒ మీ దృష్టిలో ఫిట్ నెస్ అంటే?

చాలామంది ఫిట్ నెస్ అంటే కండలు మాత్రమే అనుకుంటారు. కానీ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఫిట్ గా ఉండడమే అసలైన ఫిట్ నెస్. జిమ్ తో పాటు యోగాను కూడా చేర్చండి. ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉండండి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics