త్వరలో సమంత 'రంగస్థలం' ఫస్ట్ లుక్

Sunday,January 28,2018 - 03:06 by Z_CLU

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ , టీజర్ తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా త్వరలో మరో ఫస్ట్ లుక్ తో హంగామా చేయబోతుంది. ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న సమంత లుక్ కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో  రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్. విలేజ్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సమంత ఇప్పటి వరకూ కనిపించని ఓ డిఫరెంట్ లుక్ లో లచ్చిమి అనే పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఇటివలే ఈ సినిమాలో సమంత స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు ఈ సినిమాలో సమంత లుక్ ను అఫీషియల్ గా రివిల్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ ఫస్ట్ లుక్ కోసమే టీజర్లో సమంత క్యారెక్టర్ కి సంబంధించి ఒక్క సీన్స్ కూడా లేకుండా యూనిట్ జాగ్రత్త పడ్డారని వినికిడి. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ చిట్టిబాబుగా హంగామా చేస్తుంటే త్వరలో సమంత లచ్చిమి గా సందడి చేయబోతుందన్నమాట.