రామ్ చరణ్ సరసన సమంత?

Tuesday,November 29,2016 - 02:15 by Z_CLU

సమంత త్వరలో అక్కినేని నాగ చైతన్య ను పెళ్లాడబోతుందనే విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చెయ్యక పోవడం తో ఇక సమంత సినిమాలు మానేసిందనే వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. కానీ, ఇప్పుడు సమంత మరోసారి కెమెరాముందుకొచ్చే ఆలోచనలో ఉందట. అది కూడా రామ్ చరణ్
సినిమాలో హీరోయిన్ గా నటించనుందనే వార్త వైరల్ అయింది.

ramchran-samantha-2

హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే పాత్రలు తగ్గిపోతున్నాయని చెప్పిన సమంత… పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉండే రోల్ వస్తే తప్పక చేస్తానని గతంలోనే ప్రకటించింది. అలాంటి ఛాలెంజింగ్ పాత్రే చెర్రీ సినిమా రూపంలో సమంత వద్దకు వచ్చినట్టు టాక్. ఆ సినిమా మరేదో కాదు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ. త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో చెర్రీ సరసన నటించడానికి సమంత ఒప్పుకుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. చైతూతో పెళ్లికి ఇంకా టైం ఉండడంతో.. ఈలోగా ఈ సినిమా కంప్లీట్ చేయాలని సమంత అనుకుంటోందట.