సమంత లేడీ ఒరియెంటెడ్ సినిమా... అంతా రెడీ

Sunday,September 23,2018 - 02:02 by Z_CLU

ప్రస్తుతం ‘యూ టర్న్’ అనే రీమేక్ సినిమాతో థియేటర్స్ సందడి చేస్తున్న సమంత నెక్స్ట్ ఓ లేడి ఒరియెంటెడ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది… నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.. లక్ష్మి భూపాల మాటలు అందించనున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించనున్నట్లు సమాచారం.

ప్రెజెంట్ నాగ చైతన్య తో కలిసి శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనుంది సామ్.. ఇటివలే లాంచ్ అయిన ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ సినిమా ఫినిష్ చేసిన తర్వాతే లేడి ఒరియెంటెడ్ సినిమా చేయనుందట సమంత.