సమంత కొత్త సినిమా డీటెయిల్స్ ఇవే

Friday,March 13,2020 - 12:18 by Z_CLU

జాను తర్వాత సమంత గ్యాప్ తీసుకుంటుందని అంతా అనుకున్నారు. ఆమె కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయిపోతుందంటూ గాసిప్స్ వదిలారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. సమంత ఆల్రెడీ ఓ కొత్త ప్రాజెక్ట్ పై సైన్ చేసింది.

అశ్విన్ శరవణన్ డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతోంది సమంత. గతంలో తాప్సితో గేమ్ ఓవర్ అనే సినిమా చేసింది ఇతడే. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా సమంతతో సినిమా చేయబోతున్నాడు. ఇదొక లేడీ ఓరియంటెడ్ మూవీ.

ఇప్పటికే సమంత-అశ్విన్ మధ్య స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. కంప్లీట్ స్క్రీన్ ప్లే పూర్తయిన వెంటనే సినిమా సెట్స్ పైకి వస్తుంది. సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది.