ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న వెకేషన్ ను సంతోషంగా ముగించింది సమంత–నాగచైతన్య జంట. ఈరోజు మాల్దీవుల నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు శామ్-చైతూ.
లాక్ డౌన్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈ స్టార్ కపుల్.. మాల్దీవులకు వెళ్లింది. ఫైవ్ స్టార్ రిసార్ట్ లో ఆహ్లాదంగా గడిపింది. Samantha Maldives ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే నాగచైతన్య మాత్రం ఎప్పట్లానే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. అతడికి చెందిన ఫొటోలు ఒకట్రెండు మాత్రమే కనిపించాయి. సమంత మాత్రం ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది.

సమంత వేసుకున్న కాస్ట్యూమ్స్, ఆమె యాక్ససిరీస్ అన్నీ బాగా పాపులర్ అయ్యాయి. నెటిజన్లు వాటిపై ఆరాలు తీయడం మొదలుపెట్టారు. సమంత యాక్ససిరీస్ రేట్లు కూడా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు. చివరికి హైదరాబాద్ లో ల్యాండ్ అయినప్పుడు కూడా సమంత ఔట్ ఫిట్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.
మొత్తమ్మీద శామ్-చైతూ రీఫ్రెష్ అయ్యారు. సమంత కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం ఆడియన్స్ వెయిటింగ్. అటు నాగచైతన్య మాత్రం ఆల్రెడీ లాంఛ్ చేసిన ThankYouMovie సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.