అక్టోబర్ లో సమంత మూవీ ఫెస్టివల్

Saturday,August 19,2017 - 07:30 by Z_CLU

సమంత కి అక్టోబర్ చాలా ప్రత్యేకం కానుంది. ఈ నెలలోనే సమంత చైతన్య ను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి ఘట్టంతో పాటు సమంత నటించిన ఓ మూడు సినిమాలు కూడా అక్టోబర్ నెలలోనే రిలీజ్ కి రెడీ అవుతుండడం విశేషం.

ఇప్పటికే ఇళయదళపతి విజయ్ తో ‘తెరి’,’కత్తి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సమంత ప్రస్తుతం ‘మెర్సల్’ అనే సినిమా చేస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. తెలుగులో ‘అదిరింది’ అనే టైటిల్ తో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మావయ్య నాగార్జున తో కలిసి నటించిన ‘రాజు గారి గది2’ సినిమా కూడా అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలతో పాటు విజయ్ సేతుపతి తో సమంత నటిస్తున్న సినిమాను కూడా అక్టోబర్ లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

సో అక్టోబర్ నుంచి పెళ్లితో ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న సమంత మరో వైపు తను నటించిన సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్ అందిస్తూ అభిమానులకు మూవీ ఫెస్టివల్ ప్లాన్ చేస్తోందన్నమాట.