72 కిలోలు ఎత్తిన సమంత

Sunday,November 06,2016 - 11:06 by Z_CLU

ఈ ఫొటో చూశారుగా… సమంత పవర్ ఏంటో తెలిసిపోతుంది ఇది చూస్తే.. ఇదేదో 10 కేజీలు… పాతిక కేజీల బరువు కాదు. అచ్చంగా 72 కిలోల బరువు. అవును… 72 కిలోల వెయిట్స్ ను అవలీలగా ఎత్తేసింది సమంత. ఆ ఫొటోల్ని, వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. అమ్మాయిల పవర్ అంటే ఇది అంటూ ట్వీట్ కూడా చేసింది.

నిజానికి అమ్మాయిలు జిమ్ లో ఇంత కష్టపడాల్సిన పనిలేదు. ట్రెడ్ మిల్, స్కిప్పింగ్, సైక్లింగ్, స్మాల్ డంబెల్స్ లాంటివి చేస్తే చాలు. కానీ సమంత మాత్రం ఇంత హెవీ వెయిట్స్ జోలికి ఎందుకెళ్లింది అన్నది మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కొత్తగా ఒప్పుకున్న రెండు తమిళ సినిమాల్లో ఏదైనా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరే.. సమంత ఎందుకు ఇంత బరువు ఎత్తిందనే విషయాన్ని పక్కనపెడితే.. ఆమె చేసిన పనిని మాత్రం కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే.