నాని నిర్మాత.. సమంత హీరోయిన్

Saturday,January 12,2019 - 12:30 by Z_CLU

వాల్ పోస్టర్ సినిమా.. నాని స్థాపించిన బ్యానర్ పేరు. ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ”అ!” అనే సినిమా నిర్మించాడు నాని. అది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి నిర్మాతగా మారుతున్నాడు నాని. ఈసారి తన సెకెండ్ వెంచర్ కు సమంతను సెలక్ట్ చేసుకున్నాడు.

అవును.. నిర్మాతగా తీయబోయే రెండో సినిమా కోసం ఫిమేల్ ఓరియంటెడ్ స్టోరీని సెలక్ట్ చేసుకున్నాడు నాని. ఇందులో సమంత నటిస్తే బాగుంటుందని భావించి ఆమెను కలిశాడు. ఈ సినిమాను డైరక్ట్ చేయబోయే నిర్మాతను త్వరలోనే మీడియాకు పరిచయం చేయబోతున్నారు.

అంతా ఓకే కానీ, ప్రస్తుతానికైతే ప్రాజెక్టు ఇంకా ఫైనల్ అవ్వలేదు. 2 సినిమాలతో సమంత బిజీగా ఉంది. వీటిలో మజిలీ సినిమా త్వరలోనే కొలిక్కి వస్తుంది. అప్పుడు నాని సినిమాపై క్లారిటీ వస్తుంది.