మరోసారి తెరపైకి నాగచైతన్య-సమంత

Saturday,March 31,2018 - 01:26 by Z_CLU

పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించే మూవీ ఇప్పటికే ఫిక్స్ అయింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అది కాదు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా గురించి. అవును.. చైతూ-శామ్ కాంబినేషన్ లో మరో సినిమాకు కూడా రంగం సిద్ధమౌతోంది.

రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. బాబి దర్శకత్వంలో రాబోతోంది ఈ సినిమా. ఇందులో వెంకీ సరసన హీరోయిన్ గా నయనతారను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇక చైతూ సరసన సమంత అయితే బాగుంటుందని యూనిట్ ఫిక్స్ అయింది.

ఈ సినిమాకు ప్రొడ్యూసర్ సురేష్ బాబు. ఆయన, వెంకీ కలిసి అడిగితే సమంత కాల్షీట్లు దొరకడం పెద్ద సమస్య కాదు. సో.. నాగచైతన్య-సమంత కాంబోలో మరో మూవీ సెట్ అయిపోయినట్టే.