మామతో కలిసి షూటింగ్ లో సమంత

Friday,May 03,2019 - 05:34 by Z_CLU

నాగార్జునతో కలిసి నటించడం సమంతకు కొత్త కాదు. గతంలో మనం, రాజుగారి గది-2 సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ మన్మధుడు-2 సినిమాలో కూడా ఆమె ఉందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ టాపిక్ ఇలా వైరల్ అవుతున్న టైమ్ లోనే సమంత పోర్చుగల్ చేరుకోవడం, షూటింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగిపోయాయి.

అవును.. సమంత ప్రస్తుతం పోర్చుగల్ లో ఉంది. మన్మధుడు-2 సినిమాకు సంబంధించి 2 రోజుల షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. సినిమాలో ఓ కీలకమైన సన్నివేశంలో సమంత ఎంట్రీ ఉంటుందట. ఆ సీన్ లో సమంత ఉంటేనే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అయ్యారు. అలా నాగ్ రిఫరెన్స్ తో సమంత ఎంట్రీ ఇచ్చింది.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. చైతన్ భరధ్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ స్పాట్ లో వెన్నెల కిషోర్, రాహుల్, నాగ్ తో కలిసి సమంత దిగిన సెల్ఫీ ప్రస్తుతం వైరల్ అవుతోంది.