మామ సినిమాలో సమంత?

Thursday,February 28,2019 - 01:01 by Z_CLU

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో క్లాసిక్ సినిమాగా నిలిచిన “మన్మధుడు” సినిమా సీక్వెల్ కి రెడీ అవుతున్నాడు. “చి.లా. సౌ” ఫేం రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సీక్వెల్ పై నాగార్జున పూర్తి నమ్మకంగా ఉన్నాడు.

మార్చి 12 న గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారు మూవీ యూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో అక్కినేని సమంతా కూడా నటించే అవకాశం ఉందట.

అవును.. ఈ సినిమాలో కథని మలుపు తిప్పే పాత్రని సమంతా తో చేయించనున్నాడట రాహుల్ రవీంద్రన్. సమంత, రాహుల్ ఎప్పటినుంచో మంచి స్నేహితులు. పైగా ఇది మామగారి సినిమా. దీంతో సమంతా కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు టాక్.

సమంత ఎంటరైతే నాగ్-సమంత కాంబోలో ఇది మూడో సినిమా అవుతుంది. గతంలో మనం, రాజు గారి గది 2 సినిమాలు కలిసి చేశారు వీళ్లిద్దరూ. మన్మధుడు 2 సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ యూరోప్ లో ప్లాన్ చేశారు.