ఒక్క ఫొటోకు మిలియన్ లైక్స్

Tuesday,May 12,2020 - 01:37 by Z_CLU

అది కొత్త ఫొటో కాదు, చాన్నాళ్ల కిందటి ఫొటోనే. అలా అని అందులో కొత్తదనం కూడా ఏమీ లేదు. చూడ్డానికి రొటీన్ గానే ఉంది. కానీ ఆ ఫొటోకు 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. దానికి కారణం ఆ స్టిల్ లో ఉన్న హాట్ కపుల్.

అవును.. భర్త నాగచైతన్యతో కలిసి సమంత పెట్టిన ఓ పాత ఫొటోకు (Throwback Pic)కు నెటిజన్లు సూపర్బ్ గా రెస్పాండ్ అయ్యారు. ఏకంగా మిలియన్ లైక్స్ కట్టబెట్టారు. సోషల్ మీడియాలో ఈ కపుల్ కు ఉన్న పాపులారిటీ అలాంటిది.

స‌మంత‌, ఆమె భ‌ర్త నాగచైత‌న్య‌, పెంపుడు కుక్క హ్యాష్‌తో క‌లిసి కారులో కూర్చున్న ఓ పాత‌ ఫోటోను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా `దాదాపు ఓ గొప్ప సాహ‌స‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్నాం` అంటూ క్యాప్ష‌న్ కూడా జ‌త‌చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్ లో తెగ వైర‌ల్ అవుతోంది.