Vijay Deverakonda Samantha మూవీ అప్ డేట్స్

Tuesday,April 19,2022 - 03:24 by Z_CLU

Samantha fixed for Vijay Deverakonda’s up coming film

ఇటివలే పూరి దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాను కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 21న లాంచ్ అవ్వనుంది. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా 23 నుండే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.  ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని తెలుస్తుంది.

సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుందని సమాచారం. విజయ్ -సమంత ‘మహానటి’ సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా కోసం కలవనున్నారు. ఇందులో  సమంత కశ్మీరీ అమ్మాయిగా కనిపించనుందని టాక్ వినబడుతుంది.

సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి విజయ్ , సమంత లకు ఫైనల్  నెరేషన్ కూడా ఇచ్చేసాడట శివ నిర్వాణ. ఏప్రిల్ నుండి కాశ్మీర్ లో లాంగ్ షెడ్యుల్ జరుపుకోనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మించనున్నారు. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడని అంటున్నారు దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics