రంగస్థలం: సమంత ఫస్ట్ లుక్ అదుర్స్

Friday,February 09,2018 - 11:45 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రంగస్థలం సినిమా నుంచి సమంత ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు. రామలక్ష్మిగా సమంత అందంగా కనిపించింది. తక్కువ మేకప్ లో సమంత లుక్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆమె బట్టలు ఉతికే సీన్స్, సైకిల్ తొక్కే సన్నివేశాల్ని ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు.

సమంత విజువల్స్ కు బ్యాక్ గ్రౌండ్ లో రామ్ చరణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ మరో హైలెట్. ఆమె నడిచొస్తుంటే ఊరికి 18 ఏళ్ల వయసొచ్చినట్టుందని, చిట్టిబాబు గుండెకాయ కొల్లగొట్టింది ఈ పిల్లే అంటూ చరణ్ చెప్పిన వాయిస్ బాగాా సెట్ అయింది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టోటర్ టీజర్ కు అందం తీసుకురాగా… ఓవరాల్ గా రంగస్థలం నుంచి వచ్చిన రెండో టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది. ఎల్లుండి (11వ తేదీ)తో టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. షూటింగ్ పూర్తయిన రెండు రోజులకు (ఫిబ్రవరి 13న) రంగస్థలం మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. మార్చి 30న మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.