మహానటిలో సమంతా జస్ట్ జర్నలిస్ట్ కాదు...

Friday,April 06,2018 - 06:48 by Z_CLU

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది మహానటి. ఈ సినిమాలో సమంతా జర్నలిస్ట్ గా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ రోజు సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. దానికి తోడు పోస్టర్ లో ‘నా పేరు కన్యాశుల్కంలో సావిత్రి గారి పేరే.. మధురవాణి’ ( B.A. గోల్స్ మెడలిస్ట్), అని ఉండటంతో ఈ సినిమాలో సమంతా, మహానటి సావిత్రి గ్రేట్ ఫ్యాన్ అయి ఉంటుందని ఊహించేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఈ రోజు రిలీజైన ఈ పోస్టర్ లో సమంతా రెగ్యులర్ గెటప్ లో కాకుండా, పొడవాటి జడ, కళ్ళద్దాలు దానికి తోడు చుట్టూరా ఫైల్స్ ని బట్టి చూస్తుంటే, సమంత క్యారెక్టర్ డెఫ్ఫినేట్ గా, 1980 – 90 బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందనిపిస్తుంది. సావిత్రి లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజ్ ని ఇమోషనల్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఈ సినిమాని మే 9 న రిలీజ్ చేయనుంది. కీర్తి సురేష్ సావిత్రి రోల్ లో కనిపించనున్న ఈ సినిమాని స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు.