నేను చెప్పదలుచుకున్నదొకటే – సమంతా

Tuesday,September 18,2018 - 06:32 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘యూటర్న్’ సక్సెస్ తో మరోసారి సక్సెస్ ఫుల్ అనిపించుకుంది సమంతా. మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా, ఆడియెన్స్ ఈజీగా రీచ్ అవ్వడంతో, బాక్సాఫీస్ దగ్గర కూడా అంతే సక్సెస్ ఫుల్ గా నిలబడింది యూటర్న్. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్ లో చాలా ఇమోషనల్ గా మాట్లాడింది సమంతా.

“థ్రిల్లర్ సబ్జెక్ట్ అనగానే అందరికీ రీచ్ అవుతుందో లేదో అని ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ మంచి సినిమా తీస్తే ఆదరిస్తారని మళ్ళీ నిరూపించారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నదొకటే, ఇప్పటి నుండి ఏ సినిమా చేసినా నా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తా, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయగలిగే సినిమాలే చేస్తా..” అని ఇమోషనల్ గా చెప్పుకుంది సమంతా.

స్టోరీ బేస్డ్ సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా క్రేజ్ క్రియేట్ చేసుకుంది సమంతా. త్వరలో శివ నిర్వాణ డైరెక్షన్ లో సెట్స్ పైకి రానున్న సినిమాలో చైతు సరసన నటించనుంది సమంతా. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.