కర్రసాము చేసిన సమంత

Thursday,April 20,2017 - 11:40 by Z_CLU

ఏదైనా కొత్తగా చేయడం సమంతకు అలవాటు. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేసింది ఈ బ్యూటీ. ఏకంగా కర్రసాము చేసేసింది. జిమ్ లో సమంత కర్రసాము చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. ఈ వీడియోను సమంత ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా లైకుల మీద లైకులు వచ్చి పడుతున్నాయి. పోస్ట్ చేసిన గంటకే ఏకంగా 69వేల వ్యూస్ వచ్చాయంటే, వీడియో ఎంత వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

 

ఫిట్ నెస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సమంత. రోజూ కాసేపు జిమ్ లో టైమ్ స్పెండ్ చేస్తుంది. ఫిట్ గా ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం ఉంటుందని, అప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలమని బలంగా నమ్మే వ్యక్తుల్లో సమంత ఒకరు. గతంలో కూడా ఈ బ్యూటీ, ఏకంగా వెయిట్ లిఫ్టింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈసారి కూడా అలానే అందరికీ షాాకిచ్చింది. ఛాలెంజెస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే సిలంబమ్ ట్రై చేశా అంటూ వీడియో పెట్టింది. కర్రసామునే తమిళ్ లో సిలంబమ్ అంటారు.