రంగస్థలం షూటింగ్ పూర్తిచేసిన సమంత

Sunday,February 04,2018 - 02:02 by Z_CLU

రంగస్థలం సినిమాకు సంబంధించి సమంత పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని అక్కినేని సమంత స్వయంగా వెల్లడించింది. ఓ స్పెషల్ టీమ్ తో వెరీ స్పెషల్ జర్నీ చేశానని, సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది.

రంగస్థలం సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. చిట్టిబాబు క్యారెక్టర్ లో రామ్ చరణ్ కనిపించిన లుక్ అది. దీనికి కొనసాగింపుగా మరికొన్ని రోజుల్లో సమంత ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు లచ్చిమి.

మార్చి 30న థియేటర్లలోకి రానున్న రంగస్థలం సినిమాకు సుకుమార్ దర్శకుడు. 1985నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడుగా నటిస్తున్నాడు.