సమంతా పేరు మార్చుకుంది

Friday,September 30,2016 - 03:16 by Z_CLU

సమంతా పేరు మార్చుకుందా..? అసలా అంత అవసరం తనకేంటి..? ఇంకా కొన్ని రోజుల్లో అక్కినేని వారింట కోడలుగా అడుగుపెట్టనున్న సమంతాకి పేరు మార్చుకోవాల్సినంత అవసరం ఏం వచ్చింది..? అని ఆరా తీస్తే సమంతా పేరు మారిన విషయం వాస్తవమే కానీ అందులో తన ప్రమేయం ఏమాత్రం లేదని తేలింది.

samantha-donates-30-lakhs-to-chennai-floods-rains-12-1449929679-23-1463976808-1

నాగచైతన్య, సమంతాల పెళ్లిని నాగార్జున ఇటు అధికారికంగా ప్రకటించాడో లేదో అప్పుడే ఇంట్లో, అటు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇంకా ఇతరత్రా అక్కినేని ఫ్యామిలీ గ్రూప్స్ లో ఉద్యోగులు… సమంతాని పేరుతో కాకుండా “చిన్న మేడమ్” అని పిలవడం మొదలు పెట్టేశారట. అక్కినేని కాంపౌండ్ లో పెద్ద మేడమ్ అమల అయితే… సమంతకు చిన్న మేడమ్ హోదా దక్కిందన్నమాట. పెళ్లికి కూడా అక్కినేని కుటుంబంలో తనకు దక్కిన గౌరవానికి సమంత ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. అలా సమంతా పేరు తనకు తెలీకుండానే మారిపోయింది.