భర్తతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్

Tuesday,April 28,2020 - 10:30 by Z_CLU

మామూలుగా అయితే సమంత పుట్టినరోజుకు ఓ రేంజ్ లో హంగామా ఉంటుంది. కనీసం 10-15 కేకులైనా కట్ చేస్తుంది ఈ అక్కినేని కోడలు. కానీ ఇది లాక్ డౌన్ టైమ్. దీంతో ఇంట్లోనే తన భర్తతో కలిసి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది శామ్.

భార్య సమంత కోసం నాగచైతన్య చెఫ్ గా మారిపోయాడు. వంటింట్లోకి వెళ్లి సమంత కోసం ప్రత్యేకంగా కేక్ తయారుచేశాడు. ఆ కేక్ ను సమంత కట్ చేసింది. అలా ఈ ఏడాది పుట్టినరోజును సింపుల్ గా కానిచ్చేసింది.

ఫ్యాన్స్ రోడ్ల మీదకు రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం సమంత పుట్టినరోజు వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఆమె ఫ్యాన్ క్లబ్స్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాయి. అటు కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో సమంతకు విశెష్ చెబుతున్నారు.

ఈ పుట్టినరోజును సమంత ఇంట్లోనే సింపుల్ అండ్ స్వీట్ గా జరుపుకోవాలని కోరుకుంటూ.. ఆమెకు బర్త్ డే విశెష్ అందిస్తోంది జీ సినిమాలు.