సమంతా బర్త్ డే స్పెషల్....

Saturday,April 28,2018 - 11:46 by Z_CLU

‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమాంత మాయ యూత్ పై ఏ రేంజ్ లో పని చేసిందంటే, ఒక్క సినిమాతోనే యూత్ కి దిల్ కి ధడ్కన్ అనిపించుకుంది. రీసెంట్ హిట్ ‘రంగస్థలం’ సినిమాతో సమంతా చేయలేనిదంటూ ఏమీ లేదు అని ప్రూఫ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఈ రోజు తన 31 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటుంది.  ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

మాయ చేసింది : టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వస్తున్నా ‘ఏ మాయ చేశావే’ ని రీప్లేస్ చేయలేం. సిల్వర్ స్క్రీన్ పై పర్ఫెక్ట్  రొమాంటిక్ ఎసెన్స్ ని జేనేరేట్ చేసింది సినిమా. ‘జెస్సీ’ గా ఒక్క సినిమాతోనే  ఫ్యాన్స్ మనసుల్లో పర్మనెంట్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంది సమంతా. టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందన్న విషయం ఈ ఒక్క సినిమాతోనే తెలిసిపోయింది.

కరియర్ బెస్ట్ చాయిస్  : ఫస్ట్ సినిమా తర్వాత టాప్ స్టార్స్ తో గ్లామర్ డాల్ గా అలరించినా, సమంతాని అన్ని క్యాటగిరీస్ కి దగ్గర చేసింది ‘ఈగ’ సినిమా. ఈ సినిమా తరవాత సమంతా కరియర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అల్ట్రా కమర్షియల్ హీరోయిన్ : హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో బిజీగా ఉన్న సమాంత కరియర్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టిన సినిమాలు ‘అత్తారింటికి దారేది’, ‘ రామయ్య వస్తావయ్య’, ‘మనం’, ‘S/o సత్యమూర్తి’, ‘అ..ఆ’.., ‘జనతా గ్యారేజ్’… ఇలా చెప్పుకుంటూ పోతే సమాంత ఏ సినిమాలో కనిపించినా స్పెషల్ ఇంపాక్ట్ ఉండేంతలా మ్యాజిక్ చేసింది.

డెఫ్ఫినేట్ గా చాలా స్పెషల్ : సమాంత కరియర్ గ్రాఫ్ ని గమనిస్తే రీసెంట్ గా చేసిన ‘రంగస్థలం’, ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న ‘మహానటి’ డెఫ్ఫినేట్ గా చాలా స్పెషల్. డెడికేషన్, సిన్సియారిటీ ఉండాలే కానీ కరియర్ గోల్స్ ని రీచ్ అవ్వడం పెద్దగా కష్టమేం కాదు అని బిలీవ్ చేసే సమంతా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకెన్నో హైట్స్ కి రీచ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.