'రాజుగారి గది-2' సెట్స్ లో సమంత....

Tuesday,March 07,2017 - 06:04 by Z_CLU

ఎట్టకేలకు సమంత తెలుగు సినిమా స్టార్ట్ చేసింది. జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పటివరకు టాలీవుడ్ లో సినిమా చేయని ఈ బ్యూటీ.. ఎట్టకేలకు రాజుగారి గది-2 సెట్స్ పైకి వచ్చింది. నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సమంతది ఓ కీలకమైన పాత్ర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

ప్రస్తుతం సమంత తమిళ్ లో 2 సినిమాలు చేస్తోంది. ఆ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. రాజుగారి గది-2లో ఆమె నటించనుందనే వార్త అందరికీ తెలిసిందే. ఇంతలోనే సడెన్ గా సెట్స్ పై ప్రత్యక్షమైంది . ఈ సినిమాతో పాటు త్వరలోనే రామ్ చరణ్-సుకుమార్ సినిమా కూడా స్టార్ట్ చేయనుంది. ఈనెల 22 నుంచి చెర్రీ-సుక్కీ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది సమంత.

నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ తర్వాత సమంత ఇక సినిమాలు తగ్గించేస్తుందని అంతా అనుకున్నారు. కానీ పెళ్లి లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించాలని సమంత భావిస్తోంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు కేటాయిస్తోంది. సినిమాలతో పాటు మరోవైపు యాడ్స్ తో కూడా బిజీగా ఉంటోంది.