సమంత.. ది క్యాబ్ డ్రైవర్

Saturday,June 29,2019 - 02:07 by Z_CLU

పెళ్లి తర్వాత పూర్తిగా ట్రాక్ మార్చిన సమంత, తన పాత్రలకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రం ఒప్పుకుంటోంది. అందుకే ఆమె స్టార్ హీరోలకు దూరమైంది. అయితేనేం సమంతకంటూ ఇప్పుడొక
ఇమేజ్ ఉంది. ఆమెకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ అయింది.

ఆ బ్రాండ్ ను కొనసాగిస్తూ ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శామ్. గిరీశయ్య అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సమంత ఓ సినిమా చేయబోతోంది. గతంలో ఇతడు అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేశాడు.

ఓ హాలీవుడ్ సినిమాను బేస్ చేసుకొని రాబోతున్న ఈ మూవీలో సమంత క్యాబ్ డ్రైవర్ రోల్ పోషించబోతోందట. ఓ బేబీ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి.