Samantha - మరికొన్ని రోజుల్లో బాలీవుడ్ మూవీ

Monday,October 18,2021 - 12:18 by Z_CLU

Samantha Announced back to back movies

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న సమంత, ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 2 బై-లింగ్వుల్ సినిమాలు ఎనౌన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది చివర్లోగా హిందీ సినిమా ఎనౌన్స్ చేసే ప్లాన్స్ లో ఉంది.

దసరా సందర్భంగా 2 ద్వి-భాషా చిత్రాలు ఎనౌన్స్ చేసింది శామ్. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా చేయబోతోంది. ఈ ప్రాజెక్టును హరి-హరీష్ అనే ఇద్దరు వ్యక్తులు డైరక్ట్ చేయబోతున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

samantha akkineni photo shoot

ఇక డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై మరో సినిమా ఎనౌన్స్ చేసింది సమంత. శంతరుబన్ జ్ఞానశేఖరన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా చేయబోతోంది. ఎస్ఆర్ ప్రభు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా కూడా ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వచ్చేలా ఉంది.

ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పే ఆలోచనలో ఉంది సమంత. రీసెంట్ గా ఫ్యామిలీ మేన్-2లో నటించిన ఈ బ్యూటీ, బాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. ఆ క్రేజ్ ను కంటిన్యూ చేస్తే, ఓ మంచి ప్రాజెక్టుతో హిందీలో లాంచ్ అవ్వాలనుకుంటోంది.

samantha-new-stills

సో.. వచ్చే ఏడాది సమంత వరుస సినిమాలతో బిజీ కాబోతోందన్నమాట. ఈ గ్యాప్ లో ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics