బన్నీ సినిమా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Saturday,September 28,2019 - 11:06 by Z_CLU

సంక్రాంతి రిలీజ్ కోసం శరవేగంగా ముస్తాబవుతున్న సినిమా అల వైకుంఠపురములో. బన్నీ-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం అఫీషియల్ గా మొదలైంది. ముందుగా సామజవరగమన.. అనే సాంగ్ రిలీజ్ చేశారు.

లిరికల్ వీడియోస్ అంటే సాధారణంగా ఫొటోలు పెట్టి విడుదల చేస్తుంటారు. కానీ సామజవరగమన సాంగ్ కోసం కాస్త కొత్తగా ట్రై చేశారు. మ్యూజిక్ డైరక్టర్ తమన్, సింగర్ సిద్ శ్రీరామ్ అంతా కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా వీడియో షూట్ చేసి మరీ ఈ సింగిల్ వదిలారు. ఈ ఒక్క పాట కోసం ఏకంగా చిన్న సెట్ వేసి సూట్ చేశారంటే, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడంలేదనే విషయం అర్థమౌతూనే ఉంది.

ఇక సాంగ్ విషయానికొస్తే.. వెస్ట్రన్, క్లాసికల్ మిక్స్ చేసి తమన్ ఈ పాటను కంపోజ్ చేశాడు. గతంలో అరవింద సమేత సినిమాకు కూడా ఇలానే ఫ్యూజన్ స్టయిల్ ఫాలో అయ్యాడు. ఇది త్రివిక్రమ్ టేస్ట్ అనుకోవాలేమో. తన గొంతుతోనే పాటను సగం హిట్ చేసే, సిద్ శ్రీరామ్ ఈ పాటకు జీవం పోయగా… సీతారామశాస్త్రి గారి సాహిత్యం పాటకు ఓ కొత్త అందం తీసుకొచ్చింది. ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.