అల వైకుంఠపురం అప్ డేట్స్

Friday,November 08,2019 - 02:46 by Z_CLU

బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురం సినిమా ఫాస్ట్ గా రెడీ అవుతోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి సినిమాను పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మూవీకి సంబంధించి ప్రస్తుతం పారిస్ లో షూటింగ్ జరుగుతోంది.

సూపర్ డూపర్ హిట్ అయిన సామజవరగమన పాటను పారిస్ లోని అందమైన లొకేషన్లలో షూట్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాచ్డ్ సాంగ్ గా ఇది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇంత హిట్ అయిన ఈ సాంగ్ ను విజువల్ గా కూడా అంతే హిట్ చేయాలనే కసితో వర్క్ చేస్తోంది యూనిట్. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రాఫర్.

బన్నీ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఆడియోతో సూపర్ హిట్ అయిన సామజవరగమన సాంగ్ ను వీడియోగా కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఓ స్టిల్ రిలీజ్ చేసినే యూనిట్.. త్వరలోనే వీడియో సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించనుంది