రియల్ టైగర్: 6 రోజుల్లో రూ.300 కోట్లు

Thursday,December 28,2017 - 05:30 by Z_CLU

సల్మాన్, కత్రినాకైఫ్ జంటగా నటించిన సినిమా టైగర్ జిందా హై. లాస్ట్ వీక్ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు సృష్టిస్తోంది. విడుదలైన ఈ 6 రోజుల్లో టైగర్ జిందా హై సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. విడుదలై వారం కూడా కాకుండానే ఈ సినిమాకు ఇంత వసూళ్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇండియాలో ఈ సినిమా 190 కోట్ల 62 లక్షల రూపాయల నెట్ సాధించింది. మరో 24 గంటల్లో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని.. వీకెండ్ నాటికి 250 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ ఎనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. సల్మాన్ క్రేజ్ కారణంగా నెగెటివ్ టాక్ ను అధిగమించింది.

ట్యూబ్ లైట్ ఫ్లాప్ తర్వాత సల్మాన్ నటించిన సినిమా ఇది. సో.. ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ దీనిపై కూడా పడుతుందని అంతా ఊహించారు. కానీ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన టైగర్ జిందా హై మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తోంది.