సల్మాన్ కి కలిసి రాని రంజాన్

Friday,June 30,2017 - 06:03 by Z_CLU

ఈద్ ని సల్మాన్ ఖాన్ ని విడదీసి చూడలేం. ఈద్ కి సల్మాన్ ఖాన్ సినిమా రిలీజయిందంటే బాక్సాఫీస్ దగ్గర పంట పండాల్సిందే. కానీ ఈ సారి హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన ‘ట్యూబ్ లైట్’ ఆ సంప్రదాయానికి పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేసింది. కబీర్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 6 రోజుల్లో డొమెస్టిక్ మార్కెట్ లో 105.86 కోట్లు వసూలు చేయగలిగినా, సల్మాన్ ఖాన్ గత సినిమాలతో పోలిస్తే ట్యూబ్ లైట్ వెనకపడిందనే చెప్పాలి.

2015 లో రిలీజైన ‘భజ్ రంగీ భాయ్ జాన్’ ఫస్ట్ 7 రోజుల్లో 184.62 కోట్లు వసూలు చేస్తే, ‘సుల్తాన్’ ఏకంగా 9 రోజుల్లో 229.16 కోట్లు వసూలు చేసి సర్ ప్రైజ్ చేసేసింది. ఇక బాడీగార్డ్ 115 కోట్లు, ఇక ఏక్ థా టైగర్ 154.21 కోట్లు, వసూలు చేస్తే, ఆవరేజ్ టాక్ తెచ్చుకున్న కిక్ 164. 09 కోట్లు 7 రోజుల్లో వసూలు చేసింది.

 

ఈ సినిమాలతో కంపేర్ చేస్తే సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ ఫ్లాప్ సినిమా అనే చెప్పాలి. కానీ సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమా క్రియేట్ చేసిన క్రేజ్ ఫిల్మ్ మేకర్స్ కి లాభాలు తెచ్చి పెట్టినా, డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాన్ని భరించాల్సి వచ్చిందని చెప్తున్నాయి ట్రేడ్ వర్గాలు.