సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’ ఫస్ట్ లుక్ రిలీజయింది

Wednesday,April 19,2017 - 03:01 by Z_CLU

కబీర్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్. హిస్టారికల్ వార్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫస్ట్ లుక్  ఈ రోజే రిలీజయింది. 1962 లో జరిగిన సైనో ఇండియన్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ చైనా అమ్మాయి ప్రేమలో పడే యువకుడిగా నటిస్తున్నాడు.

హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన చైనా హీరోయిన్ జూజూ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రీతమ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ ఫస్ట్ లుక్ తో పాటు, షారుక్ ఖాన్ ఈ సినిమాలో కామియో రోల్ లో నటిస్తున్నాడనే టాక్ కూడా కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఈ సినిమాని ఈద్ రోజు రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.