Salaar రిలీజ్ డేట్ లాక్ !

Monday,March 01,2021 - 12:59 by Z_CLU

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ని సైతం ఎట్రాక్ట్ చేస్తూ అంచనాలు నెలకొల్పుతున్న ‘సలార్’  రిలీజ్ డేట్ ఫిక్సయింది.   పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ – పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.

SALAAR_Release-poster-zeecinemalu

 హోంబలే ఫిలింస్‌ బేనర్ పై విజయ్‌ కిరంగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రవి బసృర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ వచ్చే ఏడాది మాస్ యాక్షన్ సినిమా ‘సలార్’ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరి ఈ క్రేజీ  కాంబో సినిమా ఎంతటి సంచలన విజయం సాధిస్తుందో చూడాలి.