దుమ్మురేపుతున్న "సైనిక" సాంగ్

Tuesday,January 30,2018 - 11:59 by Z_CLU

స్టయిలిష్ స్టార్ బన్నీ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ నా పేరు సూర్య. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒకే ఒక్క సాంగ్ రిలీజైంది. కానీ ఆ ఒక్క పాట సోషల్ మీడియాను ఏలుతోంది. రిపబ్లిక్ డే కానుకగా విడుదలైన ఈ సైనిక సాంగ్… విడుదలైన మరుక్షణం నుంచి టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా 3 మిలియన్ వ్యూస్ సాధించింది.

కేవలం యూట్యూబ్ లోనే ఈ సాంగ్ ను 30లక్షల మంది వీక్షించారు. మిగతా సోషల్ మీడియా మాధ్యమాల్ని కూడా కలుపుకుంటే ఈ లెక్క మరింత పెరుగుతుంది. ఓన్లీ వ్యూస్ మాత్రమే కాదు, యూట్యూబ్ లో ఈ సాంగ్ ను లక్ష మందికి పైగా లైక్ చేశారు. అంతలా ఆడియన్స్ కు కనెక్ట్ అయింది సైనిక సాంగ్.

సైనిక సాంగ్స్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. బాలీవుడ్ హిట్ మ్యూజిక్ డైరక్టర్స్ విశాల్-శేఖర్  కంపోజ్ చేశారు. సాహిత్యంలో ఉన్న జోష్ ను తమ కంపోజిషన్ తో డబుల్ చేశారు. అందుకే ఈ పాట యూత్ పై అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

మిలట్రీ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో వస్తోంది ఈ సినిమా. మూవీకి సంబంధించి మరో సాంగ్ ను వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 27న థియేటర్లలోకి రానుంది నా పేరు సూర్య సినిమా.