సైనా నెహ్వాల్ బయోపిక్ లో శ్రద్ధాకపూర్

Wednesday,April 26,2017 - 02:04 by Z_CLU

వరల్డ్ నంబర్ 1 బ్యాడ్ మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ కి గ్రౌండ్ వర్క్ బిగిన్ అయింది. అమోల్ గుప్తా డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ సైనా నెహ్వాల్ రోల్ ని ప్లే చేయనుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ లో అనౌన్స్ చేసిన శ్రద్ధా కపూర్, ఈ క్యారెక్టర్ కోసం అప్పుడే ప్రాక్టీస్ కూడా బిగిన్ చేసేసింది. ఈ బయోపిక్ కి ‘సైనా’ అని టైటిల్ ని ఫిక్స్ చేసింది సినిమా యూనిట్.

ఇప్పటికే బ్యాడ్ మింటన్ ప్రాక్టీస్ ని బిగిన్ చేసేసిన శ్రద్ధా కపూర్ కి, తన ఇన్నాళ్ళ సినిమా కరియర్ లో ఇది బిగ్గెస్ట్ చాలెంజింగ్ వెంచర్ కానుంది. ఇప్పటి వరకు ఫిక్షన్ క్యారెక్టర్స్ లో అలవోకగా ఒదిగిపోయి నటించిన శ్రద్ధా ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలో నటించబోతుంది.

T- సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆల్ రెడీ రిసర్చ్ కంప్లీట్ చేశాడు డైరెక్టర్ అమోల్ గుప్తా. సైనా నెహ్వాల్ చైల్డ్ హుడ్ నుండి బిగిన్ చేస్తే వరల్డ్ నంబర్ 1 స్థాయికి రీచ్ అవ్వడానికి సైనా ఎదుర్కున్న చాలెంజెస్ తో ఆల్ రెడీ స్క్రిప్ట్ ని లాక్  చేసుకున్న సినిమా యూనిట్, రైట్ టైమ్ చూసుకుని సెట్స్ పైకి రానుంది.