AdiPurush - మరో కీలక ప్రకటన

Thursday,September 03,2020 - 11:22 by Z_CLU

ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్-ఇండియా మూవీ ఆదిపురుష్ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ పాత్రను తాజాగా ఫిక్స్ చేశారు. రీసెంట్ వినిపించిన పుకార్లను నిజం చేస్తూ.. Adipurush లో సైఫ్ అలీఖాన్ (Saif AliKhan)ను విలన్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈరోజు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

Prabhas హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతోంది ఆదిపురుష్. కలియుగ దైవం శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇక రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు.

Raavana పాత్రకు ఎంపికైన విషయాన్ని సైఫ్ కూడా కన్ ఫర్మ్ చేశాడు. మరోసారి ఓం రౌత్ దర్శకత్వంలో నటించబోతున్నందుకు హ్యాపీగా ఉందని.. ఈసారి కత్తి పట్టుకొని ప్రభాస్ తో తలపడబోతున్నానని ప్రకటించాడు.

సినిమాకు సంబంధించి హీరో-విలన్ పాత్రలు ఫిక్స్ అవ్వడంతో ఇక సీత పాత్ర పోషించనున్న హీరోయిన్ పై అందరి దృష్టి పడింది. ప్రస్తుతానికైతే ఈ పాత్ర కోసం కియరా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారు. ఆ ప్రకటన కూడా త్వరలోనే రాబోతోంది.