తేజూ మార్క్ హల్ చల్

Friday,October 21,2016 - 05:27 by Z_CLU

పవర్ ఫుల్ పోలీస్ గెటప్ లో మరో నక్షత్రం మెరిసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాకు సంబంధించి దశలవారీగా ఫస్ట్ లుక్స్ విడుదల అవుతున్నాయి. రామ్ చరణ్ చేతుల మీదుగా రోజుకో లుక్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా నక్షత్రం మూవీకి సంబంధించి సాయిధరమ్ తేజ లుక్ ను విడుదల చేశారు.

    సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చెర్రీ చేతుల మీదుగా తేజూ లుక్ విడుదలైంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ తేజూ అదిరిపోయాయాడు. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తేజూతో పాటు ప్రగ్యా జైశ్వాల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.