విన్నర్ రిలీజ్ డేట్..

Wednesday,October 26,2016 - 06:01 by Z_CLU

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘విన్నర్’. త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసే పోరాటంతో కూడిన కథ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.

    నవంబర్ 2 నుంచి ఉక్రెయిన్ లో 3 పాటలు షూట్ చేసి ఆ తరువాత ఇస్తాంబుల్ లో యాక్షన్ పార్ట్ షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్న ఈ సినిమాను మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్రవరి 24 న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.