'చిత్ర‌ల‌హ‌రి' షూటింగ్ షురూ

Monday,November 19,2018 - 06:08 by Z_CLU

‘తేజ్’ తర్వాత నెక్స్ట్ సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకున్న  సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ ఎట్టకేలకు తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.  కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఇటివలే లాంచ్ అయిన ‘చిత్రలహరి’ షూటింగ్ మొదలైంది.  మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.ప్రస్తుతం సాయి ధరం తేజ్, కళ్యాణి , నివేత పెతురాజ్ లపై కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారు.

 సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుద‌ల చేయడానికి  ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.