రిపీట్ అంటున్న మెగా హీరో

Saturday,May 19,2018 - 04:20 by Z_CLU

‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాతో త్వరలోనే థియేటర్స్ లో  ఎంట్రీ ఇవ్వబోతున్నమెగా హీరో సాయి ధరం తేజ్… నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టేసాడు. ఇప్పటికే కిషోర్ తిరుమల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన తేజ్ త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు.

ఈ సినిమాలో కూడా మళ్ళీ అనుపమ తో కలిసి రోమాన్స్ చేయబోతున్నాడట తేజ్.   తేజ్ ఐ లవ్ యూ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో మళ్ళీ ఈ జోడి ని రిపీట్ చేయాలనీ భావిస్తున్నాడట కిషోర్ తిరుమల.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మే నెలాఖరున సినిమాను లాంచ్ చేసి జూన్ నుండి షూట్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.