Supreme Hero Sai Tej’s ‘Republic’ to release on October 1 for Gandhi Jayanti
సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్‌లో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్ `రిపబ్లిక్`. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, కాలేజ్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయితేజ్ యాక్టింగ్, దేవ్ కట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది.
మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్. కె.ఎల్.ప్రవీణ్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
సాయితేజ్, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన
సాంకేతిక వర్గం:
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, జీస్టూడియోస్, జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ, మాటలు, దర్శకత్వం: దేవ్ కట్టా
స్క్రీన్‌ప్లే: దేవ కట్ట, కిరణ్ జయ్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: మణిశర్మ
ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics