‘బెల్లం శ్రీదేవి’ మళ్ళీ కలిసొస్తుందా..?

Saturday,June 22,2019 - 01:03 by Z_CLU

సుప్రీమ్ స్థాయి హిట్ సాయి తేజ్ కరియర్ లో మళ్ళీ పడలేదు. రీసెంట్ గా రిలీజై హిట్టయింది అనిపించుకున్న చిత్రలహరి తరవాత సినిమాలను ఎంచుకునే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్. ఏది ఏమైనా ఈ సారి చేయబోయే సినిమాతో మళ్ళీ ‘సుప్రీమ్’ స్థాయి సక్సెస్ అందుకోవాలని డిసైడ్ అయి ఉన్న సాయి తేజ్, హీరోయిన్ రాశిఖన్నా ని కూడా రిపీట్ చేస్తున్నాడు.

సుప్రీమ్ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి అప్లాజ్ వచ్చింది. అయినా ఆ తరవాత ఏ సినిమాలో ఈ జోడీ రిపీట్ అవ్వలేదు, మళ్ళీ ఇన్నాళ్ళకు వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

సుప్రీమ్ లో ‘బెల్లం శ్రీదేవి’ అదరగొట్టేసింది రాశిఖన్నా. ఈ సినిమాలో కూడా మారుతి రాశిఖన్నా కోసం అలాంటి డిఫెరెంట్ ఆటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ నే రాసుకున్నాడట. దానికి తోడు మారుతీ మార్క్ కామెడీ టచ్ ఉండనే ఉంటుంది. కాబట్టి ఈ జోడీ ఈసారి కూడా మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అనే అనిపిస్తుంది.

మారుతికి ఆడియెన్స్ పల్స్ గట్టిగానే తెలుసు. ఎంత కాదనుకున్నా మారుతి సినిమాల్లో ఉండే న్యాచురల్ కామెడీ విషయంలో ఆడియెన్స్ లో భారీ అంచనాలుంటాయి. అందునా మెగా హీరో… అ పైన క్రేజీ జోడీ… అన్నీ కలిసొచ్చి సాయి తేజ్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడేమో చూడాలి.