Zee Exclusive : సాయి తేజ్ నెక్స్ట్ మూవీ డీటెయిల్స్

Friday,August 14,2020 - 11:50 by Z_CLU

ప్రస్తుతం సుబ్బు అనే కొత్త దర్శకుడితో Solo Brathuke So Better అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా తర్వాత దేవా కట్ట తో సినిమా చేయనున్నాడు తేజ్. ఈ రెండు కాకుండా ఈరోజు మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నాడు. తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ కి సంబంధించి సోషల్ మీడియా లో హింట్ ఇచ్చాడు SaiTej

సిద్ధార్థి నామ సంవత్సరే ! బృహస్పతి: సింహరాశౌ స్థిత సమయే, అంతిమ పుష్కరే||… అనే లైన్స్ తో సినిమాకి సంబంధించి హిట్ ఇస్తూ 12 గంటల 6 నిమిషాలకు డీటెయిల్స్ తెలియనున్నాయని చెప్పాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించి జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ గా డీటెయిల్స్ అందిస్తుంది. కార్తిక్ అనే దర్శకుడితో తేజ్ సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించి టైటిల్ తో పాటు సినిమాను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాను Sukumar Writings తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN Prasad నిర్మిస్తారు. అయితే టైటిల్ ఏంటనేది తెలియాలంటే మాత్రం అనౌన్స్ అయ్యే వరకు ఆగాల్సిందే.